Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు
లాభాల కోసం మార్గాలను అన్వేషిస్తున్న ఎడ్యూటెక్ కంపెనీ, ఆన్లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్ అన్అకాడమీ మరోసారి చేదువార్త చెప్పింది. మరో దఫా ఉద్యోగుల కోతను ప్రకటించింది. కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 12 శాతం లేదా 380 మందిని తాజా రౌండ్లో తొలగించింది. మరోసారి ఇలాంటి సందేశం ఉద్యోగులకు పంపించాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అన్అకాడమీ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజల్ విచారం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు రాసిన ఇంటర్నల్ మెమోలో వివరాలను వెల్లడించారు.
అయితే కంపెనీ ప్రధాన వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించేందుకు సరైన నిర్ణయాలన్నీ తీసుకున్నామని, అందుకోసం దురదృష్టవశాత్తూ మరో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గౌరవ్ ముంజల్ అన్నారు. వాస్తవిక పరిస్థితుల దృష్ట్యా సిబ్బందిలో 12 శాతం మేర తగ్గించాలని భావించామన్నారు. కాకపోతే మళ్లీ ఇలాంటి నిర్ణయం ప్రకటించాల్సి వస్తుందనుకోలేదన్నారు. క్షమాపణ కోరుతున్నానని ఉద్యోగులకు సందేశమిచ్చారు. 12 నెలల్లో మొత్తం 1400 మందిని తొలగించినట్ట సమాచారం.