Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగర్ కర్నూల్
విద్యుత్ బిల్లుల వసూళ్లలో తేడాలు రావడంతో 14 మంది విద్యుత్ అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఘటన సంచలనం కలిగించింది. జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో నెలకు రూ. 9.32 లక్షలు తేడా రావడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
ఈ విషయాన్ని ఎస్పీడీసీఎల్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిలో 9 మంది ఏఈఈలు, నలుగురు ఏడీఈలు, ఒక డీఈకి నోటీసులు అందజేశారు. ఈ తరుణంలో గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో విద్యుత్ మీటర్లు లేకుండా వాడుతున్న కరెంట్ వల్ల తేడా వచ్చినట్లు సూపరింటెండెంట్ ఇంజినీర్ లీలావతి వెల్లడించారు. మీటర్లు లేని చోట్ల తాజాగా మీటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.