Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జగన్ పదే పదే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారో అసలు విషయం బట్టబయలైందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడని కీలక ఆరోపణలు చేశారు సిపిఐ నారాయణ. అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. కేసు నుంచి తప్పించడానికి కర్ణాటక ఎన్నికల్లో 100సీట్లు గెలిపించాలని అమిత్ షాతో ఒప్పందం కుదిరిందన్నారు. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తాన్ని కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపితో చేసుకున్న ఒప్పందంతో వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుందని అన్నారు. వైసీపీని ఓడించాలంటే మా ఒక్కరి వల్లే కాదని.. టీడీపీ, పవన్ కల్యాణ్, సీపీఐ, సీపీఐ(ఎం) కలసి ఒకే వేదికపైకి వస్తే ప్రజల్లో ఒక విశ్వాసం వస్తుందన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో లెఫ్ట్ పార్టీ, టిడిపి మధ్య మంచి ఫలితాలు వచ్చాయన్నారు. పొత్తుల గురించి ఇప్పటి వరకు చర్చలు జరగలేదని.. పోత్తుల కలయికు టీడీపీ పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు.