Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతికి వెళ్లే వేలాది మంది భక్తుల అవసరాలను తీర్చడానికి... సికింద్రాబాద్ టు తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. దీనికోసం ప్రధాని మోడీ ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రానున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను వచ్చే ఏప్రిల్ 8న ప్రారంభించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనులను శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ రానున్నట్లు వెల్లడించారు. ఈ పనులకు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నామని రైల్వే అధికారులు వివరించారు.