Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ: వేడినీళ్ల బకెట్లో పడిన 8 నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన విజయవాడలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిట్టినగర్‌లోని లంబాడీపేట గాంధీ బొమ్మ ప్రాంతంలో ఆదిమల్ల ప్రణతి, ప్రేమ్‌కుమార్ దంపతులు తమ 8 నెలల పాప ప్రఖ్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 27న పాప పడుకున్న మంచం పక్కనే బకెట్లో వాటర్ హీటర్ పెట్టి తల్లి బయటకు వెళ్లారు. ఆ సమయంలో భర్త ఇంట్లో లేరు. కాసేపటికి పాప ఏడుపు వినిపించడంతో తల్లి పరుగున వచ్చి చూడగా ప్రఖ్య వేడినీటి బకెట్లో పడిపోయి కనిపించింది. శరీరమంతా కాలిపోవడంతో వెంటనే స్థానికులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 29వ తేదీ రాత్రి శిశువు మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.