Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది బలగం మూవీ. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి తొలివారంలో విడుదలైంది. మొదటి రోజు నుంచి పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకుని ఇప్పటికీ మంచి ప్రదర్శనను కొనసాగిస్తుంది. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన తీరుకు వేణుపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురపిస్తున్నారు. ఇటీవలే ఓటీటీలో విడుదలై మరింత ఆధరణ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రెండు ఇంటర్నేషన్ల అవార్డులను గెలుచుకుంది.
బలగం సినిమా తాజాగా లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ విషయాన్ని వేణు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. నా బలగం సినిమాకు ఇది మూడో అవార్డు. ప్రపంచ వేదికపై బలగం మెరిస్తుంది. ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫి అవార్డును గెలుచుకున్నందుకు మా సినిమాటోగ్రాఫర్ ఆచార్య ఆచార్య వేణుకు అభినందనలు అని ట్విట్టర్లో ఫోటోలు పంచుకున్నాడు.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించాడు. దాదాపు రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి నిర్మాతలకు పదింతల లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో వేణుకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. తన నెక్స్ట్ సినిమా కూడా దిల్‌రాజు బ్యానర్లోనే తెరకెక్కుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా గీతాఆర్స్ట్ నుంచి కూడా వేణుకు పిలుపు వచ్చినట్లు టాక్.