Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్గొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. శ్రీరామనవమి పండుగ పూట నేతలు తమ మండల కేంద్రాల్లో రికార్డింగ్ డాన్సులతో అల్లాడించారు. అధికారులు మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. డీజే లు పెట్టి మరీ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. పోటీ పడి మరీ నాయకులు రికార్డింగ్ డాన్సులు నిర్వహించి వార్తల్లో నిలిచారు. తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాలు విడివిడిగా రికార్డిండ్ డాన్సులను నిర్వహించాయి. మూడు చోట్ల ఎమ్మెల్సీ వర్గీయలు.. రెండు చోట్ల ఎమ్మెల్యే వర్గీయలు రికార్డింగ్ డాన్సులను నిర్వహించారు. ఒక చోట కాంగ్రెస్ వారితో కలిపి మొత్తంగా తిరుమలగిరి సాగర్ మండల కేంద్రం ఆరు చోట్ల రికార్డింగ్ డాన్సులతో హోరేత్తింది. రికార్డింగ్ డాన్సుల నిర్వహణలోనూ అధికార బీఆర్ఎస్ వర్గ పోరు బయటపడింది.