Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిజామాబాద్: జిల్లా మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న సనత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు పెద్దపల్లి జిల్లా వాసి.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వైద్య కళాశాలకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
కాగా నెల రోజుల క్రితం నిజామాబాద్లో హర్ష అనే మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైద్య విద్యార్థి స్వస్థలం మంచిర్యాల జిల్లా జిన్నారం. అర్ధరాత్రి రెండు గంటల వరకూ తోటివారితో కలిసి చదువుకున్న హర్ష.. తెల్లవారేసరికి హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. ఏమైందో ఏమో కానీ ఉరేసుకుని బలవన్మరణం పాలయ్యాడు. హర్ష నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. ఇప్పుడు మరో విద్యార్థి సూసైడ్ చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.