Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి దేశపతితో పాటు కుర్మయ్యగారి నవీన్‌కుమార్, చల్లా వెంకటరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ తరుణంలో ఈ ముగ్గురూ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్లో నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి తో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.