Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కేంద్రం రాహుల్ గాంధీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత జానారెడ్డి విమర్శించారు. రాహుల్ ఎంపీ సభ్యత్వం రద్దు చేయడాన్ని ఖండించిన జానారెడ్డి ప్రతిపక్షాలు ఐక్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీరుపై 17 విపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయని అన్నారు.
కేంద్రం నియంతృత్వ ధోరణిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అంతే కాకుండా కేంద్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని జానారెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ లో అదానీ, మోడీల సంబంధాన్ని ప్రశ్నించినప్పటి నుంచే రాహుల్ పై కక్ష కట్టారని ఆరోపించారు. ఆ తర్వాత వెనువెంటనే రాహుల్ కేసుపై కోర్టు తీర్పు ఇవ్వడం, అనర్హత వేటు వేయడం, బంగ్లాను ఖాళీ చేయాలని చెప్పడం ఇవన్నీ కుట్రలో భాగంగానే చేశారని జానారెడ్డి ఆరోపించారు. మోడీ అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలన్నారు.