Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పనాజీ
విదేశీ పర్యాటకురాలిపై గోవాలో దాడి జరిగింది. డచ్‌కు చెందిన మహిళతో గోవాలోని హోటల్ సిబ్బంది ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెతో పాటు రక్షించేందుకు వచ్చిన స్థానిక వ్యక్తిని పోడిచి పరారయ్యాడు.
ఎస్పీ నిధిన్ వల్సన్ తెలిపిన వివరాల ప్రకారం డచ్ నుంచి గోవాకు వచ్చిన యురికో అనే పర్యాటకురాలు ఉత్తర గోవా పెర్నెమ్‌లోని ఓ హోటల్లో దిగారు. ఈ క్రమంలో హోటల్ సిబ్బందిలో ఒకడైన అభిషేక్ వర్మ మంగళవారం రాత్రి ఆమె గదిలోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించి వేధించాడు. భయంతో మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానిక వ్యక్తి వచ్చి అడ్డుకున్నారు. దాంతో అభిషేక్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ తరుణంలోనే మళ్లీ రాడని అనుకునే లోపే కత్తితో తిరిగి వచ్చాడు. అడ్డుకున్న వ్యక్తిపై దాడి చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా పోడిచి పరారయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందుతుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టిన పోలీసులు శుక్రవారం అతణ్ని అరెస్టు చేశారు. నిందితుడు ఉత్తరాఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.