Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీలలో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్ ఎత్తివేయనున్నట్లు తెలిపారు. సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జ్ భారీగా పెంచనున్నట్లు ప్రకటించారు. అయితే మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10శాతం డిస్కౌంట్ ఉండేది. దీనికీ కోత విధించనున్నారు. ఈ తరుణంలో శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు డిస్కౌంట్ ఉండదు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే రాయితీ ఉంటుంది. సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు రూ.59గా ఉన్న ధరను రూ.99కి పెంచనున్నారు.అలాగే కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్స్ ధరను భారీగా పెంచనున్నారు.