Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిజామాబాద్
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీల వార్ ముదురుతోంది. రెండు మూడు నెలలుగా హైదరాబాద్ లో రాత్రికి రాత్రి పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు వెలుస్తున్నాయి. ఇప్పుడు ఇవి తెలంగాణలోని జిల్లాలకు కూడా పాకాయి. నిజామాబాద్ లో పసుపు పండించే రైతులు ఎక్కువ. కానీ ఏటా మద్దతు ధర రాక నష్టపోతున్నారు.
ఈ తరుణంలో నిజామాబాద్ కు పసుపు బోర్డును తీసుకొస్తానని గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. ఆయన గెలుపులో ఈ హామీ కీలక పాత్ర పోషించింది. అయితే నాలుగేళ్లు పూర్తయినా పసుపు బోర్డు రాలేదు. ఈ క్రమంలో నిజామాబాద్ సిటీలో పోస్టర్లు వెలిశాయి. పసుపు బోర్డు ఇది మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు’’ అంటూ కాస్త వెటకారాన్ని యాడ్ చేసి నిజామాబాద్ అంతటా ఫ్లెక్సీలను అంటించారు. ఈ బోర్డులను పసుపులో పెట్టి అసలైన బోర్డును తీసుకురాలేదంటూ నిలదీశారు.