Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు చుక్కెదురైంది. సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న ఆయన్ని ఈడీ విచారిస్తోంది. ఈ తరుణంలో సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు బెయిల్‌ను రిజెక్ట్ చేస్తూ తీర్పునిచ్చింది.