Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : యువ కథానాయకులలో సందీప్ కిషన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వెళుతున్న ఆయన, తన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా పేరే 'ఊరు పేరు భైరవకోన'. ఒక ప్రత్యేకమైన జోనర్లోని సినిమాలను చేసుకుంటూ వెళుతున్న వీఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు. గతంలో ఆయన నుంచి వచ్చిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ... 'ఒక్క క్షణం' చూస్తే, ఆయన మార్క్ సినిమాలు ఎలా ఉంటాయనేది తెలుస్తుంది. అలాంటి ఒక ఆసక్తికరమైన లైన్ పైనే 'ఊరుపేరు భైరవకోన' నడవనుంది. సందీప్ కిషన్ జోడీగా వర్ష బోల్లమ్మ నటించిన ఈ సినిమాను రాజేశ్ దండ - బాలాజీ నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'నిజమేగా చెబుతున్నా జానే జానా .. నిన్నే నే ప్రేమిస్తున్నా' అంటూ సాగుతోంది. శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. యూత్ ను ఆకట్టుకునే బీట్ తో ఈ పాట సాగుతోంది.