Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 16వ సీజన్ మరికాసేపట్లో మొదలు కానుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్తో తలపడనుంది. కొద్దిసేపటి క్రితం టాస్ వేశారు. ఈ టస్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై సుపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. విజయంతో టోర్నీని ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. గుజరాత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, కేన్ విలియమ్సన్, ట్రావిస్ హెడ్, వృద్దిమాన్ సాహాతో బ్యాటింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. గత సీజన్లో దంచి కొట్టిన డేవిడ్ మిల్లర్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. బౌలింగ్లో షమీ, రషీద్ ఖాన్ చెలరేగితే చెన్నై జట్టుకు కష్టమే.