Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీకి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని పలు ప్రాంతాల్లో 'మోడీ హఠావో-దేశ్ బచావో' వ్యాఖ్యలతో పోస్టర్లను అంటించారు ఆప్ కార్యకర్తలు. దేశవ్యాప్తంగా పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించిన రోజు తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోడీపై అభ్యంతరకర పోస్టర్లు అంటించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారు తమ పార్టీ కార్యకర్తలే అని గుజరాత్ ఆప్ చీఫ్ ఇసుదన్ గాధ్వీ అన్నారు. బీజేపీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, అందుకే మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
బీజేపీ నియంతృత్వాన్ని చూడండి.. మోడీ హటావో దేశ్ బచావో అనే పోస్టర్లకు సంబంధించి గుజరాత్లోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద జైలుకు పంపారు! ఇది మోడీకి, బీజేపీకి భయం కాకపోతే ఇంకేంటి? ఇలా ప్రయత్నించండి. మీకు కావలసినంత కష్టపడండి! ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పోరాడతారు అంటూ ట్వీట్ చేశాడు గధ్వీ. ఆప్ మోడీకి వ్యతిరేకంగా 'మోడీ హఠావో-దేశ్ బచావో' ప్రచారాన్ని దేశవ్యాప్తంగా 11 భాషల్లో ప్రారంభించింది. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూతో పాటు గుజరాతీ, పంజాబీ, తెలుగు, బెంగాలీ, ఒరియా, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లోనూ పోస్టర్లు విడుదల చేసింది. అంతకు ముందు దేశరాజధాని ఢిల్లీలో ఇలాగే ప్రధానికి వ్యతిరేకంగా ఆప్ పోస్టర్లను అంటించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 49 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. ఆరుగురిని అరెస్ట్ చేశారు.