Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్: స్నేహితులతో సరదాగా ఆడిపాడి అమ్మ చేతి గోరుముద్దలు తిని నాన్నమ్మ చెంత చేరి కథ చెప్పమంటూ రాత్రి నిద్రపోయిన బాలిక గుండెపోటుతో శాశ్వతంగా దూరమైంది. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అబ్బాయిపాలెం శివారు బోడతండాకు చెందిన బోడ లక్పతి, వసంత దంపతుల కుమార్తె స్రవంతి (13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గురువారం శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తండాలోని తోటి మిత్రులతో ఆడుకుంది. ఎప్పటిలాగే రాత్రి నిద్రపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఆయాసపడుతూ తనకేదో అవుతోందని చెప్పి నాన్నమ్మను నిద్ర లేపింది. మాట్లాడలేక ఆయాసపడుతూ లేచి కూర్చొని ఒక్కసారిగా మంచంపైనే ఒరిగిపోయింది. తల్లిదండ్రులు బిడ్డను తీసుకొని దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ వద్దకు పరుగు తీశారు. అప్పటికే బాలిక గుండె ఆగిందని తెలుసుకొని విలపించారు.