Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు లెక్చరర్ల ను అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని ఖమ్మం నల్గొండ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఏ నర్సిరెడ్డికి యావత్తు కాంట్రాక్టు ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వెంటనే క్రమబద్దీకరణ ఉత్తర్వులు వచ్చేటట్లు చేయాలని విన్నవించుకుంటున్నాం.