Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగిత్యాల
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళం కార్యక్రమంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సంబరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నృత్యం చేస్తూ బీఆర్ఎస్ నేత బండారి నరేందర్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంతో నృత్యాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారు రజిని భర్త నరేందర్ కూడా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అయితే ఉన్నట్టుండి నరేందర్ తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన నరేందర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో నరేందర్ మృతి విషయం తెలిసిన ఎమ్మెల్సీ కవిత.. జగిత్యాల పర్యటనను రద్దు చేసుకున్నారు.