Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో శనివారం సీఎం కెసిఆర్ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. మహారాష్ట్ర రైతు నేత శరద్ జోషీ, ప్రణీత్, పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నా రాజకీయ జీవితమంతా పోరాటాలేనని చెప్పారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లేకుండా ఉండదని తెలిపారు. రైతల పోరాటం న్యామమైంది.. తలుచుకేంటే సాధ్యం కాదా? అని కెసిఆర్ ప్రశ్నించారు. చిత్తశుద్ధితో చేస్తే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని కేసీఆర్ సూచించారు. సీఎంగా ఉండి కూడా రైతుల కోసం ఢిల్లీలో పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. రైతుల పోరాటం వల్లే కేంద్రం 3 సాగు చట్టాలను రద్దు చేశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయి. దేశమంతటా కూడా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశంలో తెలంగాణ మోడల్ చేస్తానన్నారు. యాసంగి సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడునీ, మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మంత్రులు సత్యవతి రాథోడ్, తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలవురు నేతలు పాల్గొన్నారు.