Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గాంధీనగర్
శ్రీరామ నవమి శోభాయాత్రం తరుణంలో వడోదరలో చెలరేగిన అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పటయింది. క్రైమ్ విభాగం డీసీపీ సారథ్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన పోలీసు టీమ్ ఈ సిట్‌లో ఉంటుంది. గుజరాత్‌లోని వడోదర సిటీ కుంభద్వార-హాథిఖానా ప్రాంతంలో మార్చి 30న శోభాయాత్ర సందర్భంగా రాళ్లు రువ్వుడు ఘటన చోటుచేసుకుని తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ తరుణంలో అల్లర్లను ప్రేరేపించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న 23 మందిని వడోదర పోలీసులు అరెస్టు చేశారు. ఈ 23 మందిలో ఐదుగురిని వడోదరలోని స్థానిక కోర్టు పోలీసు రిమాండ్‌కు పంపగా, 19 మందిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.