Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భోపాల్
మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలోని భోపాల్- న్యూఢిల్లీ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఏప్రిల్ 1న భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి భోపాల్-న్యూఢిల్లీ మార్గంలో 11వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.
ఈ రైలుతో రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది. భోపాల్ నుంచి న్యూఢిల్లీ సెమీ హై స్పీడ్ రైలులో 7 గంటల 45 నిమిషాల్లో చేరనున్నారు. ఇది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముంబై సెంట్రల్ - అహ్మదాబాద్ - గాంధీనగర్ క్యాపిటల్‌తో సహా భారతదేశంలోని 10 మార్గాల్లో నడుస్తోంది. ముంబై - సాయినగర్ షిర్డీ, ముంబై - షోలాపూర్, న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ - శ్రీ వైష్ణో దేవి మాత కత్రా, అంబ్ అందౌరా - న్యూఢిల్లీ, మైసూరు - పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, నాగ్‌పూర్ - బిలాస్ పూర్, హౌరా - న్యూ జల్పాయిగురి, సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.