Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 2 నుంచి మే 18వ తేదీ వరకు మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ తరుణంలో ఉప్పల్ స్టేడియం వద్ద రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషన్ డీఎస్ చౌహాన్ శనివారం ఉదయం స్టేడియంను పరిశీలించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల క్రమంలో 1500 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. స్టేడియం లోపల, వెలుపల మొత్తం 340 సీపీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జాయింట్ కమాండ్, కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. డే మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల కంటే ముందు స్టేడియంను తెరుస్తామని తెలిపారు. నైట్ మ్యాచ్‌లు జరిగినప్పుడు సాయంత్రం 4:30 గంటలకు స్టేడియం తెరవనున్నారు.