Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మొహాలీలో భారీ వర్షం కురవడంతో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. అనంతరం, లక్ష్యఛేదనలో కోల్ కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో వర్షం కారణంగా అంతరాయం కలిగింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డీఎల్ఎస్ పద్ధతిలో విజేతను తేల్చారు.