Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్ఐ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన తుది రాత పరీక్ష తేదీలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక సంస్థ(టిఎస్ఎల్పిఆర్బి) ఖరారు చేసింది. ఈ నెల 8, 9 తేదీలలో ఎస్ఐ,ఎఎస్ఐ రాత పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఎస్‌సిటి ఎస్ఐ, ఎఎస్ఐ పోస్టులకు ఈ నెల 8వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎస్‌సిటి ఎస్ఐ(సివిల్) పోస్టులకు ఈ నెల 9వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు సంబంధిత వెబ్సైట్ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లపై అభ్యర్థి ఫొటో అతికించడం తప్పనిసరి అని టిఎస్ఎల్పిఆర్బి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 93937 11110/93910 05006 ఫోన్ నెంబర్ ఫోన్ చేయాలని లేదా support@tslprb.inకు ఈమెయిల్ చేయాలని తెలిపారు.