Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముజఫర్‌నగర్: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబీకుల హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. ముజఫర్‌నగర్‌లోని షాపుర్‌లో శనివారం జరిగింది. 2020 ఆగస్టు 19న పఠాన్‌కోట్‌లోని క్రికెటర్ సురేశ్ రైనా అత్త, మామ ఇంట్లో రషీద్ చోరీకి పాల్పడ్డాడు. నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సురేశ్ రైనా మామ అశోక్ కుమార్, అత్త ఆశా, బావమరిది కౌశల్ కుమార్‌లను రషీద్ తీవ్రంగా గాయపరిచాడు. అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆశా, కౌశల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను గతేడాది సెప్టెంబరులో పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా రషీద్ పేరు బయటకొచ్చింది. అప్పటికే రషీద్ పరారీలో ఉన్నాడు. ‘శనివారం కొందరు నేరస్థులు షాపుర్‌కు వచ్చినట్లు ఇన్ఫార్మర్ నుంచి మాకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఎస్‌వోజీ బృందం అప్రమత్తమైంది. సోరం-గోయ్లా రహదారిపై దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా నిందితుడు రషీద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే షాపుర్‌లోని సీహెచ్‌సీకి తరలించాం. అప్పటికే నిందితుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు’’ అని పోలీసులు తెలిపారు.