Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో దారుణం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం గుంగుడుపల్లెలో దుండగులు కారుపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నంబర్‌ప్లేట్ ఆధారంగా మృతుడిని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా గుర్తించారు. అతడు కర్ణాటకలోని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. తిరుపతి నుంచి బ్రాహ్మణపల్లి వెళ్తుండగా.. మార్గమధ్యలో గంగుడుపల్లె సమీపంలో మంటల్లో కారు దగ్ధమైంది. దీంతో అతడు సజీవదహనమయ్యాడని చెప్పారు. ఘటనా స్థలంలో బంగారు గొలుసు, చెప్పులు లభించాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.