Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాబూల్: అఫ్గానిస్థాన్‌లో బ్రిటన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను తాలిబన్లు బంధించారు. వారిలో ఇద్దరు గత జనవరి నుంచి బంధీలుగా ఉండగా, మరొకరు ఎంతకాలం నుంచి ఉన్నారనే విషయం తెలియరాలేదని యూకేకు చెందిన నాన్ ప్రాఫిట్ గ్రూప్ ప్రెసీడియమ్ నెట్వర్క్ వెల్లడించింది. బందీలుగా ఉన్నవారిలో చారిటీ వైద్యుడైన 53 ఏండ్ల కెవిన్ కార్న్వెల్, యూట్యూబ్ స్టార్ మైల్స్ రౌట్లెడ్జ్, మరొకరి పేరు తెలియనప్పటికీ.. అతడు హోటల్ మేనేజర్ అని స్థానిక మీడియా నివేదికలు తెలుపుతున్నాయి.
కాగా, బంధీలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రెసీడియమ్ నెట్వర్క్ తెలిపింది. అపార్ధం చేసుకోవడం వల్లే వారిని బంధీలుగా పట్టుకున్నారని, విడుదల చేయాలని తాలిబన్లను కోరారు. ముగ్గురి కుటుంబ సభ్యులతో తాము మాట్లాడుతున్నామని చెప్పారు. గతేడాది నలుగురు బ్రిటన్ జాతీయులతోపాటు వెటరన్ టీవీ కెమెరామెన్‌ను తాలిబన్లు విడిచిపెట్టారు. వారిని ఆరు నెలలకుపైగా తమ బంధీలుగా ఉంచుకున్నారు.