Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు పంపిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంపై రేపు ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం కానున్నారు జగన్. ఈ సమావేశంలో 2024 ఎన్నికలకు సంబంధించి కేడర్ కు దిశ నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ క్షేత్రస్థాయి సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పనితీరుపైన ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.