Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు స్టేడియం చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం టీఎస్ ఆర్టీసీ ఉప్పల్ కు అదనంగా బస్సులు తిప్పుతోంది. మధ్యాహ్నం 12:20 గంటల నుంచి సర్వీసుల పెంచనున్నట్లు మెట్రో రైల్ కూడా ప్రకటించింది. ప్రతి రెండు, మూడు నిమిషాలకు ఒక మెట్రో రైలు ఉప్పల్ వైపు పరుగులు తీస్తుందని పేర్కొంది. సిటీ శివార్ల నుంచి ఉప్పల్ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. దీంతో సాయంత్రం వరకు ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.