Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగనున్నది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఈనేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరం నలుమూలల నుంచి ఉప్పల్ మార్గంలో ఆర్టీసీ అదనపు సర్వీసులను నడుపుతున్నది. అదేవిధంగా నాగోల్- అమీర్పేట మార్గంలో మెట్రో అదనంగా రైళ్లు నడుపుతున్నది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆర్టీసీతోపాటు మెట్రో కూడా మరిన్ని సర్వీసులను నడుపనున్నాయి.