Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
చెన్నైలో స్టెరాయిడ్ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి చెందాడు. చెన్నై ఆవడి సమీపంలోని నెమిలిచ్చేరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్దానికంగా జిమ్ టైనర్ గా 25 ఏళ్ల ఆకాష్ పని చేస్తున్నారు. బాడీ షేప్ కోసం స్టెరాయిడ్స్ విపరీతంగా వాడాడు ఆకాష్. రెండు రోజుల క్రితం రక్తం వాంతులతో పాటు,రెండు కిడ్నిలు పూర్తి కోల్పోయి ఆకాష్… చికిత్స పోందుతూ మృతి చెందాడు. స్టెరాయిడ్స్ వల్లే ఆకాష్ మరణించినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖమంత్రి సుబ్రమణ్యమ్ తెలిపారు. ఇక వాటిపై చర్యలు తీసుకొవాలి అని అదేశాలు కూడా జారీ చేశారు. తమిళనాడు ఆరోగ్య శాఖమంత్రి సుబ్రమణ్యమ్.