Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నంద్యాల
నంద్యాల జిల్లాలో భారీ చోరీ జరిగింది. నాపరాళ్ల పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో దండగులు చొరబడి 80 తులాల బంగారం, రూ.14 లక్షల నగదు దోచుకెళ్లారు. శనివారం రాత్రి అవుకు మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు.. తలుపులకు వేసిన తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో బీరువాలో దాచిన బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అవుకు ఎస్సై జగదీశ్వరరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని