Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారు. ప్రమాదంలో మరో 19 మంది వరకు గాయపడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా హిసార్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబ రాజస్థాన్‌లోని చురులోని సలాసర్ బాలాజీ ఆలయానికి దర్శనానికి వెళ్తున్నారు. తిరిగి సొంత ఊరికి వస్తున్న సమయంలో వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టింది. ఆదివారం వేకువ జామున ఒంటిగంట సమయంలో డోక్వా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్‌లో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో ఐదుగురి తీవ్రంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రాజ్‌గఢ్ పోలీస్ డీఎస్పీ అశోక్ కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల వాంగ్మూలం తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.