Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16లో భాగంగా సన్ రైజర్స్ తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు ను నమోదు చేసింది. నిర్ణిత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 203పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ కు 204పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఆరంభం నుంచి ఓపెనర్లు బట్లర్ (54), జైశ్వాల్ (54) దూకుడుగా ఆడి జట్టు స్కోరును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. ఇక కెఫ్టెన్ సంజు శాంసన్ (55) కూడా క్రీజులోకి వచ్చిన కాడ నుంచి ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. ఇక చివర్లో హెట్మెయర్ (22) కూడా విజృభించడంతో జట్టు స్కోరు 203 సాధించింది. ఇక సన్ రైజర్స్ బౌలర్లలో ఫరుఖీ రెండు వికెట్లు తీయగా నటరాజన్ రెండు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశాడు.