Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన రెండు హామీలను నెరవేర్చలేకపోయామన్నారు. వాటిలోఒకటి రూణమాఫీ ఒకటి కాగా, ఇంకోటి పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణమని ఎర్రబెల్లి తెలిపారు. రూణమాఫీ కొంతమేరకు పూర్తి చేశామని చెప్పిన ఆయన... స్థలం ఉన్న చోట ఇళ్లు నిర్మించామన్నారు. స్థలం లేని చోట నిర్మించుకోలేకపోయామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఈ రెండు హామీలను నెరవేర్చలేకపోయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కానీ మేనిఫేస్టోలో లేని అనేక హామీలను నెరవేర్చమని చెప్పుకొచ్చారు. కరోనా మహ్మమరి లేకపోయింటే వాటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేవాళ్లమని అన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి విసృత్తంగా తీసుకువెళ్లాలని సూచించారు.