Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిడ్నీ : పాపువా న్యూ గినియా దేశంలో సోమవారం తెల్లవారుజామున 4గంటలకు భారీ భూకంపం సంభవించింది. వాయువ్య పాపువా న్యూ గినియాలో శక్తివంతమైన భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇండోనేషియా సరిహద్దుకు తూర్పున 100 కిలోమీటర్ల దూరం తీర ప్రాంత పట్టణమైన వెవాక్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం సంభవించింది.62 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. భూకంప జోన్ లో మొత్తని నేల వల్ల నష్టం కలిగే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్పారు. తూర్పు పాపువా న్యూ గినియాలోని ద్వీపసమూహంలో భాగమైన రిమోట్ న్యూ బ్రిటన్ ప్రాంతం ఫిబ్రవరి నెల చివరలో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తరచూ భూకంపాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.