Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కూకట్పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని వెనుకనుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు రాజేష్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.