Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాషింగ్టన్ : ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ఫుడ్ చైన్లలో ఒకటైన మెక్డొనాల్డ్స్ త్వరలో లే ఆఫ్ ప్రకటించనుంది. తన కార్పొరేట్ ఉద్యోగులకు తాజా తొలగింపుల గురించి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. లేఆఫ్ లో భాగంగా ఈ వారం యునైటెడ్ స్టేట్స్ లోని అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం వెల్లడించింది. సోమవారం నుంచి బుధవారం వరకు ఇంటి నుంచి పని చేయడం ప్రారంభించాలని కంపెనీ గత వారం తన యూఎస్ ఉద్యోగులకు మెయిల్ పంపింది. ఉద్యోగుల తొలగింపుల కోసం మెక్డొనాల్డ్స్ ఈ నిర్ణయం తీసుకుంది. మెక్డొనాల్డ్స్ ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఏప్రిల్ 3వ వారంలో ఉద్యోగుల తొలగింపుపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని మెక్డొనాల్డ్స్ మెయిల్లో పేర్కొంది. ఈ వారంలో షెడ్యూల్ చేసిన అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేయాలని కూడా ఉద్యోగులను కోరింది. నవీకరించిన వ్యాపార వ్యూహంలో భాగంగా కార్పొరేట్ సిబ్బంది స్థాయిలను సమీక్షిస్తామని ఫాస్ట్ ఫుడ్ చైన్ జనవరిలో తెలిపింది.బుధవారం నాటికి ఉద్యోగుల తొలగింపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.