Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేరళ
కేరళలో ఇద్దరు రైలు ప్రయాణికుల మధ్య తలెత్తిన ఓ వివాదం ఊహించని మలుపు తిరిగింది. ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అళపుజ కన్నూర్ ఎక్స్ప్రెస్ రైల్లో ఈలాతూర్ వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. తొలుత ఇద్దరు ప్రయాణికుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. బాధితుడిని కాపాడేందుకు ఇతర ప్రయాణికులు రంగంలోకి దిగి రైల్లో చైన్ లాగారు. బాధితుడి మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్న కొందరికి గాయాలయ్యాయి. అయితే.. చైన్ లాగాక రైలు నెమ్మదిస్తున్న తరుణంలో నిందితుడు బోగి దిగి పారిపోయాడు.
బాధితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన వారిలో కొందరికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. రైల్లోని డీ1 కంపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందికి గాయాలు కాగా బాధితులను ఆసుపత్రికి తరలించినట్టు రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.