Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులను ప్రశ్నిస్తుంటే సంచలన విషయాలు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏఈ పేపర్ లీకేజీలో కేతావత్ రాజేశ్వర్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ పేపర్ ను రూ. 40 లక్షలకు అమ్మాడని, ఇందుకోసం అభ్యర్థుల నుంచి రూ.25 లక్షలు అడ్వాన్సుగా, పరీక్ష ఫలితాలు వచ్చాక మిగతా సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు బయటపడింది. ఈ వ్యవహారానికి సంబంధించి చేతులు మారిన నగదులో నుంచి రూ.8.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టీఎస్పీఎస్సీ ఆఫీసులోని కాన్ఫిడెన్షియల్ రూమ్ లో నుంచి ఏఈ పేపర్ ను ప్రవీణ్ కుమార్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. పెన్ డ్రైవ్ లో కాపీ చేసి బయటకు తీసుకొచ్చాడు. ఆ పేపర్ ను అమ్మేందుకు రూ.10 లక్షలకు రేణుకతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ గా రూ. 5 లక్షలు తీసుకున్నాడు. రేణుక తన భర్త డాక్యా నాయక్ తో కలిసి సమీప బంధువు రాజేశ్వర్ తో పేపర్ అమ్మకానికి సంబంధించి మాట్లాడింది. రాజేశ్వర్ మధ్యవర్తులు గోపాల్, నీలేశ్, ప్రశాంత్, రాజేంద్రలకు ఏఈ పేపర్ ను రూ.40 లక్షలకు విక్రయించాడు. అడ్వాన్స్ గా అందిన రూ.23 లక్షల్లో రూ.10 లక్షలను రేణుకకు అందించాడు.