Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగుళూరు
ఐపీఎల్లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఆ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాటర్ ఘనతను దక్కించుకున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లో అతను 82 రన్స్ చేశాడు. అయితే ఐపీఎల్లో 50 రన్స్ కన్నా ఎక్కువగా ఎక్కువ సార్లు పరుగులు స్కోర్ చేసిన జాబితాలో కోహ్లీ నిలిచాడు. ముంబై ఇండియన్స్ జట్టుపై హాఫ్ సెంచరీ స్కోర్ చేసిన తర్వాత కోహ్లీ ఆ టోర్నీ చరిత్రలో 50 ప్లస్ స్కోర్ 50 సార్లు చేసిన ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు.