Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. నేటి నుంచి సిట్ తో పాటుగా ఈడీ లోతుగా విచారించనుంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో పాటుగా ఈడీ కేసు నమోదు చేసింది. హవాలా ద్వారా డబ్బు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన 15 మందిని తిరిగి ఈడీ విచారించనుంది. టీఎస్పీఎస్సీ సభ్యులు, సెక్రటరీ, ఛైర్మన్ కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. నిందితుల బ్యా్ంకు లావాదేవీల ఇవ్వాలని ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.