Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లిన పవన్ నేడు హస్తినకు చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ తరుణంలో భాగంగా బీజేపీకు చెందిన పలువురు ముఖ్యనేతలు, కేంద్రమంత్రులతో పవన్, మనోహర్ భేటీ కానున్నారు. ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చిచే అవకాశముందని సమాచారం.