Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాంచీ: జార్ఖండ్‌లోని డియోగఢ్లో వైద్యాధికారుల అలసత్వానికి సుమారు 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు కాలం చెల్లిపోయాయి. దీంతో అధికారులు వాటిని ధ్వంసం చేశారు. డియోగఢ్లోని సర్దార్ హాస్పిట్లో ఉన్ సివిల్ సర్జన్ ఆఫీస్‌లో కరోనా వ్యాక్సిన్ డోసులను నిల్వ ఉంచారు. వాటిలో 1 లక్షా 95 వేల వ్యాక్సిన్ డోసులను ఎవ్వరికి పంపిణీ చేయకపోవడంతో వృధాగా మిగిలిపోయాయి. ఈ క్రమంలో మార్చి 31న వాటి గడువు తేదీ ముగిసిపోయింది. దీంతో అధికారులు వాటిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధ్వంసం చేశారు. మొదట వాటిని వేడినీటిలో ఉడకబెట్టిన అధికారులు అనంతరం.. నేలలో పాతిపెట్టారు.
ఈ ఘటపై స్పందిచిన అధికారులు వ్యాక్సిన్ డోసుల్లో అత్యధికంగా డిసెంబర్ నుంచి మార్చి మధ్య తేదీల్లో గడువు ముగిసిపోయాయని సదర్ హాస్పిటల్ డీఆర్సీహెచ్వో డాక్టర్ అలోక్ సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే వాటిని ధ్వంసం చేశామన్నారు. కాగా, దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరోనా డోసుల కోసం కేంద్ర ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు అధికారలో ఉన్న రాష్ట్రాలకు వ్యాక్సిన్లను కేంద్ర సరఫరా చేయకుండా వివక్ష చూపుతున్నది.