Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
రైళ్లలో వృద్ధులకు రాయితీలు కల్పించాలని, వాటిని నిలిపివేయడం సరికాదంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధానికి ఓ లేఖ రాశారు. ఈ లేఖను కేజ్రీవాల్ తన ట్విట్టర్ పేజీలోనూ పోస్ట్ చేశారు. కోట్లాది మంది వృద్ధులు టికెట్ చార్జీల్లో రాయితీల వల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలియజేస్తూ దయచేసి వీటిని నిలిపివేయవద్దని కోరారు.
కరోనా వచ్చిన తర్వాత రైళ్ల సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే. కొన్ని నెలల తర్వాతే రైలు సర్వీసులు తిరిగి తెరుచుకున్నాయి. ఆ సమయంలో రైలు టికెట్ చార్జీల్లో వృద్ధులు, ఇతర వర్గాలకు ఇస్తున్న రాయితీలను రైల్వే శాఖ నిలిపివేసింది. ఆ తర్వాత పునరుద్ధరించలేదు. ఇప్పటికీ ప్రయాణికుల టికెట్ చార్జీల రూపంలో సగం మేర నష్టాలను రైల్వే ఎదుర్కొంటోందని ఆ శాఖ చెబుతూ వస్తోంది. దీంతో రాయితీలు కొనసాగించాలంటూ కేజ్రీవాల్ కోరడం గమనార్హం.