Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు నెలలో 20 రోజులపాటు ప్రజల్లోనే ఉండాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ తరుణంలో సీఎం మాట్లాడుతూ సెప్టెంబర్ నాటికి ‘గడప గడపకు మన ప్రభుత్వం ఇతర కార్యక్రమాలు పూర్తిచేయాలన్నారు. ఈ క్రమంలో మళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఏడాదిలోపు ఎన్నికలు ఉండొచ్చని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. ఈ సమీక్షకు పలువురు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు రాలేదు. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విడుదల రజిని హాజరుకాలేదు.