Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ దాకా కొనసాగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పది పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 2,652 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను గంట ముందే సెంటర్లోకి పంపారు. 4,94,620 మంది విద్యార్థుల్లో అమ్మాయిలు 2,44,873 మంది, అబ్బాయిలు 2,49,747 మంది పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్స్ తీరును పరిశీలించేందుకు 144 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను అందుబాటులో ఉంచారు.