Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలో ఎస్సై, ఏఎస్సై తత్సమాన ఉద్యోగాల భర్తీకి ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తుది పరీక్ష హాల్టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందొచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్ 8, 9 తేదీల్లో తుది పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 1 వరకు; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నట్టు ఇటీవల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. తుది పరీక్ష రాసే అభ్యర్థులంతా ఈరోజు నుంచి నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్టికెట్లు www.tslprb.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.